
YSR Praja News Telugu : వికారాబాద్: ఉగాది పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ అవార్డు గ్రహీత కోళ్ల యాదయ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు కొత్త సంవత్సరమైన ఉగాది ప్రతి ఇంటికి ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, యువతకు మంచి అవకాశాలు కలగాలని ఆయన కోరారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెరిగి ప్రతి ఒక్కరూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
ఉగాది పండుగ మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పర్వదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోళ్ల యాదయ్య సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ విజయాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.




