
YSR Praja News : విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నదన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజా పరిణామంలో, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది.
భవానీపురం ఎక్సైజ్ అధికారులు పంపిన నోటీసుల్లో, విచారణ కోసం డిసెంబర్ 3న మధ్యాహ్నం 1:30 గంటలకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. సంబంధిత కేసు విషయాలపై స్పష్టతకు, విచారణలో పాల్గొనాలని అధికారులూ పేర్కొన్నారు.
ఈ నోటీసుల నేపథ్యంలో మరోసారి రాజకీయ దుమారం రేగే అవకాశాలు ఉన్నా
యి.




