YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఓ బహిరంగ లేఖ రాస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ నిబంధనలను పక్కన పెట్టి పనిచేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండేళ్లుగా హౌస్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగానే ఉంచడం, రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా పాలన సాగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని హరీష్ తిప్పికొట్టారు.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పులను కూడా నిర్లక్ష్యం చేస్తూ నిర్ణయాలు తీసుకోకపోవడం ప్రజా ఆశయాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. శాసనసభలో నిబద్ధత, హుందాతనానికి లోటు కనిపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
—
హరీష్ రావు ప్రధాన డిమాండ్లు
1. ఒక్కొ ఏడాదిలో కనీసం 30 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
2. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను పటిష్ఠంగా అమలు చేయాలి