కందివనం గ్రామ సర్పంచ్‌కు ఘన సన్మానం

YSR Praja News : ఫరూక్‌నగర్ మండల పరిధిలోని కందివనం (పిట్టల గూడ) గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జర్పుల జామన్ని అంబ్రు నాయక్‌ను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ నేతృత్వంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌కు సేవాలాల్ మహారాజ్ చిత్రపటంతో పాటు శాలువా కప్పి గౌరవించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్, జిల్లా యువజన అధ్యక్షులు సచిన్ నాయక్, కేశంపేట్ మండల ఉపాధ్యక్షులు నేనావత్ రవి నాయక్, మేగ్య నాయక్, యువ స్టార్ యూత్ అధ్యక్షులు శివ రాజ్ నాయక్తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు సేవాలాల్ సేన తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

సన్మాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *