YSR Praja News Telugu : తాండూర్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూర్ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తాండూర్ ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని గణపతి దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సత్యమూర్తి సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం, నిమజ్జనం సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.
తాండూర్ నియోజకవర్గంలోని ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని, గణనాథుడి కృపతో ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
“గణపతి బప్పా మోరియా.. తాండూర్ ప్రజలందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు” అని దొరశెట్టి సత్యమూర్తి తెలిపారు.




