Naidu & Pawan’s Claims Proven False: ED Confirms No Animal Fat in Tirumala Laddu Prasadam! తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు: దర్యాప్తులో స్పష్టం చేసిన ఈడీ
YSR Praja News Telugu : తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. ఈ మేరకు జంతువుల కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నాణ్యత, సరఫరాదారుల వివరాలను లోతుగా విచారించింది. వివిధ సంస్థల ప్రతినిధులను, అధికారులను ప్రశ్నించిన అనంతరం లడ్డూ తయారీ నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఏ దశలోనూ లేవని నిర్ధారించింది.
సీబీఐ సిట్ దర్యాప్తును సమర్థిస్తున్న ఈడీ నివేదిక
గతంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే నివేదిక ఇచ్చింది. తాజాగా ఈడీ కూడా అదే అంశాన్ని ధ్రువీకరించింది.
పొలిటికల్ మైలేజ్ కోసమే ఆరోపణలు: విమర్శల జోరు
ఈడీ ప్రకటన వెలువడటంతో నాటి ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్లించేందుకే (డైవర్షన్ డ్రామా) పాలకులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీవారి ప్రసాదంపై ఆధారాల్లేకుండా ఇటువంటి నిందలు వేయడం సముచితం కాదని భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




