తెలంగాణ / Telanganaతెలంగాణ తాజా వార్తలు / Telangana Latest News

హిడ్మా ఎన్కౌంటర్‌పై తీవ్ర ఆరోపణలు – దేశవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టుల పిలుపు

YSR Praja News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక ఘటనపై వివాదం తీవ్రంగా కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు…

తెలంగాణ / Telanganaతెలంగాణ తాజా వార్తలు / Telangana Latest Newsవిద్య / Education

Sankranti Holidays 2026: తెలంగాణలో పాఠశాలలకు కీలక అప్‌డేట్

YSR Praja News : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఈ ఏడాది సంక్రాంతి సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ…

ఆంద్రప్రదేశ్ / Andra Pradeshఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు / Andhra Pradesh latest Newsరాజకీయాలు / Politics

కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను కాపాడాలి: చంద్రబాబుకు వైఎస్ జగన్ కీలక లేఖ

YSR Praja News : తాడేపల్లి: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం సమర్థంగా కాపాడాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్…

తెలంగాణ / Telanganaతెలంగాణ తాజా వార్తలు / Telangana Latest Newsరాజకీయాలు / Politics

“తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల భూ కుంభకోణం: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు”

YSR Praja News హైదరాబాద్ / తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.…

తెలంగాణ / Telanganaజిల్లా వార్తలు / District News ✅తెలంగాణ తాజా వార్తలు / Telangana Latest News

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం…

తెలంగాణ / Telanganaతెలంగాణ తాజా వార్తలు / Telangana Latest Newsరాజకీయాలు / Politics

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ పర్యటనతో జనసంద్రం – కోర్టు హాజరు పూర్తిచేసుకుని లోటస్‌ పాండ్‌కు చేరుకున్న మాజీ సీఎం

YSR Praja News : హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో భారీ రద్దీ నెలకొంది. బేగంపేట విమానాశ్రయం…

జిల్లా వార్తలు / District News ✅వికారాబాద్ న్యూస్ / Vikarabad News

అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి: తాండూర్ ప్రజాసంఘాల ఆగ్రహం

YSR Praja News : తాండూర్: ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసుకున్న వారి పట్ల అలాగే వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు…

తెలంగాణ / Telanganaతెలంగాణ తాజా వార్తలు / Telangana Latest News

తెలంగాణలో కొత్త వైన్షాప్ లైసెన్సుల జారీ వేగం – ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న 2025–27 ఎక్సైజ్ పాలసీ దృష్ట్యా, కొత్తగా వైన్షాపులు పొందిన వారికి లైసెన్సులు…

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు / Andhra Pradesh latest Newsరాజకీయాలు / Politics

వైఎస్‌ జగన్ చేతుల మీదుగా మోక్షితా రెడ్డికి నామకరణం

YSR Praja News : మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనాదేవి దంపతులు తమ చిన్నారి కుమార్తెకు నామకరణం చేయించాలని ఆశిస్తూ బుధవారం తాడేపల్లిలోని…

జాతీయ వార్తలు / National Newsక్రైమ్ / Crime

ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు!

YSR Praja News : ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసును పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన వివరాలు…

హిడ్మా ఎన్కౌంటర్‌పై తీవ్ర ఆరోపణలు – దేశవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టుల పిలుపు

YSR Praja News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక ఘటనపై వివాదం తీవ్రంగా కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన జీవిత సహచరి రాజే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఘటనపై పార్టీ అధికార ప్రతినిధి అభయ్ కీలక ఆరోపణలు చేశారు.

 

ఈ ఘటనను “ఎన్‌కౌంటర్”గా చిత్రీకరించడం వాస్తవం కాదని, ముందే ప్రణాళికాబద్ధంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆయన ఒక లేఖలో ఆరోపించారు. ఈ లేఖ తేదీ 20వ తేదీగా ఉండగా, అది శుక్రవారం బహిర్గతమైంది.

 

విజయవాడలో అరెస్టు చేశారని ఆరోపణ

 

అభయ్ పేర్కొన్న వివరాల ప్రకారం, హిడ్మా మరియు రాజే వైద్య చికిత్స నిమిత్తం విజయవాడకు చేరుకున్న సమయంలో కొందరు పోలీసులకు సమాచారమిచ్చారని, దీంతో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో 15వ తేదీన వారిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. అనంతరం లొంగిపోవాలని ఒత్తిడి చేసి, అది ఫలించకపోవడంతో హత్యలు జరిగాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది.

 

తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు తప్పుడు ప్రకటనలు చేశారని అభయ్ ఆరోపించారు.

 

ఇతర సంఘటనలపై కూడా ప్రశ్నలు

 

అలాగే ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు పలువురు సభ్యులను అదుపులోకి తీసుకుని, తర్వాత ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేఖలో ప్రస్తావించారు. శంకర్, చైతు, కమ్లూ, ముల్లాల్, దేవేలు తదితరుల మృతులకు సైతం పోలీసులే బాధ్యులని మావోయిస్టు పార్టీ పేర్కొంటోంది.

 

దేశవ్యాప్త బంద్‌కు పిలుపు

 

హిడ్మా మృతిని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.

 

హిడ్మా పాత్రపై పార్టీ వ్యాఖ్యలు

 

హిడ్మా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని, భావజాల పరంగా కేడర్లకు శిక్షణ ఇచ్చాడని అభయ్ పేర్కొన్నారు. ఆయనపై పాలక వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ భావవ్యక్తీకరణ చేశారు. అయితే భద్రతా బలగాలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి.

 

అధికార వర్గాల స్పందన కోసం ఎదురుచూపు

 

ఈ ఆరోపణలపై పోలీసు, భద్రతా శాఖల నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీ

య చర్చకు దారి తీస్తోంది.

Sankranti Holidays 2026: తెలంగాణలో పాఠశాలలకు కీలక అప్‌డేట్

YSR Praja News : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఈ ఏడాది సంక్రాంతి సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రైలు, బస్ టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.

 

సంక్రాంతి సెలవులు విద్యార్థులకు చదువులోని ఒత్తిడికి తాత్కాలిక విరామం ఇవ్వడంతో పాటు.. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే ఆనందకరమైన క్షణాలకు గొప్ప అవకాశంగా మారుతున్నాయి.

 

తెలంగాణలో సెలవులపై అంచనాలు

 

తెలంగాణ విద్యాశాఖ ప్రతీ సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కలిపి ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. 2026 జనవరి 10 నుంచి జనవరి 15 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు దాదాపు ఆరు రోజుల పాటు సెలవులు లభించే అవకాశముంది.

 

ఈ సెలవులను ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉంది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది. అవసరమైతే సెలవులు ఒకటి లేదా రెండు రోజులు పెంచే అవకాశమూ ఉందని విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.

 

అదనపు సెలవుల అవకాశాలు

 

సంక్రాంతి సెలవులతో పాటు జనవరి నెలలో మరికొన్ని ముఖ్యమైన రోజులు రానున్నాయి.

వాటిలో ముఖ్యంగా:

 

జనవరి 23: వసంత పంచమి (సరస్వతీ పూజ)

 

జనవరి 26: గణతంత్ర దినోత్సవం

 

 

ఈ సందర్భంగా కూడా విద్యాసంస్థలకు సెలవులు ఉండే అవకాశం ఉంది.

 

సంక్రాంతి పండుగ ప్రత్యేకత

 

సంక్రాంతి తెలుగు ప్రజల సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ. మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమగా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశాన్ని పొందుతారు.

 

అటువంటి సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు దాదాపు జనవరి 10 నుంచి జనవరి 18, 2026 వరకు సెలవులు ఉండే అవకాశముందని సమాచారం.

 

విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక సెలవుల ప్రకటన కోసం కొద్ది

రోజులు ఆగాల్సిన అవసరం ఉంది.

కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను కాపాడాలి: చంద్రబాబుకు వైఎస్ జగన్ కీలక లేఖ

YSR Praja News : తాడేపల్లి: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం సమర్థంగా కాపాడాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన తొమ్మిది పేజీల లేఖ రాసి, జల వివాదాలపై ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం గట్టిగా వాదనలు వినిపించాలని, ముఖ్యంగా KWDT-2 (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్) వద్ద జరుగనున్న విచారణల్లో రాష్ట్ర హక్కులను బలంగా ప్రస్తావించాలని జగన్ సూచించారు. ఈ విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని కేటాయించే ప్రతిపాదనకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపితే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.

 

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ, 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ఎత్తు పెంపు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. అప్పట్లో ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

 

టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చిందని జగన్ ఆరోపించారు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు వదిలేసిందని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని జగన్ స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో ఒక్క టీఎంసీ కూడా తగ్గకుండా రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 

ఏపీ హక్కుల్లో ఏ మాత్రం కోత పడినా దానికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ తన లేఖలో స్పష్టంగా పే

ర్కొన్నారు.

“తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల భూ కుంభకోణం: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు”

YSR Praja News హైదరాబాద్ / తెలంగాణభవన్:

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సుమారు రూ.4 లక్షల కోట్ల విలువైన భూములను అక్రమంగా దక్కించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న ముఠా కారణమని ఆరోపించారు.

 

తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మాట్లాడుతూ..

బాలానగర్, కాటేదాన్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను కొందరి చేతిలో పెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితుల దృష్టి విలువైన ప్రభుత్వ భూములపై పడిందని తెలిపారు.

 

9300 ఎకరాలకు పైగా భూములపై అక్రమ కేటాయింపులు జరిగాయని, జపాన్ పర్యటన సమయంలో కూడా ఈ ఫైళ్లపై ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ కూడా మౌనంగా ఉండటం వెనుక కారణాలున్నాయని వ్యాఖ్యానించారు.

 

బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ భూ కుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామని హెచ్చరించారు. పారిశ్రామికవేత్తలు ఈ స్కామ్‌లో చిక్కుకోవద్దని ఆయన హెచ్చరికలు చేశారు.

 

ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందన:

ఫార్ములా ఈ కారు రేస్ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టడమే తప్ప, ఆధారాలు లేవన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా సిద్ధమని చెప్పారు.

 

అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారాలపై స్పందిస్తూ..

కొందరిని కాపాడేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్:

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు నేడో రేపో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు సీఎస్ రామకృష్ణారావుకు నివేదికను సమర్పించారు.

 

ఈ నివేదికపై మంత్రుల ఆమోదం కోసం సర్క్యులేషన్ పద్ధతిలో ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విచారణ ఉండటంతో, అంతకుముందే జీఓలను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

 

రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు

 

రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేయగా, ఈ నెల 23న తుది ఓటరు జాబితా విడుదల కానుంది.

 

జిల్లాల వారీగా రిజర్వేషన్లు

 

ప్రభుత్వం జారీ చేసే జీఓ ఆధారంగా 31 జిల్లాల్లో రిజర్వేషన్లు త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది.

 

ఎన్నికలు ఎప్పుడంటే?

 

లభ్యమవుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 10 నుంచి 20 మధ్యలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రతి విడత ఎన్నికల మధ్య కొద్ది రోజుల విరామం ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.

 

సంభావ్య తేదీలు ఇలా ఉండొచ్చు:

 

మొదటి విడత: డిసెంబర్ 10–11

 

రెండో విడత: డిసెంబర్ 14–15

 

మూడో విడత: డిసెంబర్ 18–19

 

 

హైకోర్టులో కీలక విచారణ

 

ఈ నెల 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ప్రభుత్వం పూర్తి వివరాలు సమర్పించనుంది. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలియజేయనుంది.

 

ఈ నేపథ్యంలో సీఎస్ కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల నిర్వహణపై విస్తృతంగా చర్చ జరిగింది.

 

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల కమిషనర్

 

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా నిర్వహించేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

 

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ పర్యటనతో జనసంద్రం – కోర్టు హాజరు పూర్తిచేసుకుని లోటస్‌ పాండ్‌కు చేరుకున్న మాజీ సీఎం

YSR Praja News : హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో భారీ రద్దీ నెలకొంది. బేగంపేట విమానాశ్రయం వద్ద ఆయన రాకను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. “జై జగన్” నినాదాలతో హర్షధ్వానాలు చేస్తూ ఆయన వాహనాన్ని అనుసరిస్తూ ముందుకు కదిలారు.

 

గన్నవరం నుంచి బయల్దేరి బేగంపేట చేరుకున్న జగన్‌ రాకతో రెండు ప్రాంతాల్లోనూ కోలాహలం నెలకొంది. అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన నేరుగా నాంపల్లి వైపు పయనమయ్యారు. భారీ ర్యాలీగా జగన్‌ కాఫీలను అనుసరిస్తూ వాహనదారులు, కార్యకర్తలు నాంపల్లికి చేరుకున్నారు.

 

ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన జగన్‌ ఇవాళ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు నమోదు చేశారు. ఆయన రాక నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు వైపు వెళ్లే రెండు మార్గాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని, న్యాయవాదులకు మాత్రమే ప్రవేశం కల్పించారు.

 

“హాజరును కోర్టు నమోదు చేసింది. ప్రస్తుతం జగన్‌ మరలా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు” అని ఆయన తరఫు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. కోర్టు ప్రక్రియ ముగిసిన వెంటనే వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి నేరుగా లోటస్‌పాండ్‌ నివాసానికి చేరుకున్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి: తాండూర్ ప్రజాసంఘాల ఆగ్రహం

YSR Praja News : తాండూర్: ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసుకున్న వారి పట్ల అలాగే వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు తాండూర్ నియోజకవర్గ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం తాండూర్ సబ్–కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి పిర్యాదు అందజేశారు.

 

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే. చంద్రయ్య, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జి సాధిక్ తదితరులు మాట్లాడుతూ—

 

గతంలో తాండూర్‌లో పనిచేసిన ఆర్డీవో ఇన్‌ఛార్జి, మున్సిపల్ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయని

 

అక్రమకారుల నుంచి భూములను వెంటనే ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని

 

సబ్–కలెక్టర్ పరిధిలోని భూముల రక్షణలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని

విమర్శించారు.

 

 

అలాగే తాండూర్ నడిబొడ్డున ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్–రిజిస్ట్రార్, తాండూర్ డివిజన్ ఆర్డీవో గా పనిచేసిన ఇన్‌ఛార్జి, మున్సిపల్ కమిషనర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అగ్గనూరు గ్రామంలోని కల్వాటు భూమిని కబ్జా చేసి, రైతులకు దారి లేకుండా చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నేతలు, తాండూర్ డివిజన్ నాయకులు రాజు, గోపాల్, రఘుపతి తదితరు

లు పాల్గొన్నారు.

తెలంగాణలో కొత్త వైన్షాప్ లైసెన్సుల జారీ వేగం – ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న 2025–27 ఎక్సైజ్ పాలసీ దృష్ట్యా, కొత్తగా వైన్షాపులు పొందిన వారికి లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ వేగవంతం చేసింది. డ్రా ద్వారా షాపులు దక్కించుకున్న వారికి అవసరమైన పత్రాలు సమర్పించిన వెంటనే లైసెన్సులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ అన్ని జిల్లాల అధికారులకు సూచనలు పంపారు.

 

కొత్త పాలసీ అమలులో భాగంగా రాష్ట్రంలోని 2,620 వైన్షాపులకు కొత్త లైసెన్సులు మంజూరు కానున్నాయి. తొలి విడత లైసెన్సు ఫీజులు చెల్లించిన వెంటనే కొత్త లైసెన్సుదారులు మద్యం విక్రయాలను ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వనున్నట్లు శాఖ స్పష్టం చేసింది.

 

 

 

రంగారెడ్డి ఎక్సైజ్ జిల్లా – లైసెన్సుల జారీపై సమీక్ష

 

రంగారెడ్డి ఎక్సైజ్ జిల్లాలోని 514 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి సంబంధించిన ప్రగతిపై డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ బుధవారం నాంపల్లి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

 

ఈ సమావేశానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఏఈసీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. కొత్త లైసెన్సుల జారీలో అనుసరించాల్సిన విధివిధానాలు, డాక్యుమెంట్ల పరిశీలన, ఫీజుల చెల్లింపు ప్రక్రియలను డీసీ దశరథ్ విపులంగా వివరించారు.

 

 

 

పాత లైసెన్సుల గడువు ముగింపు – బకాయిల వసూళ్లపై దృష్టి

 

ఈ నెల 30తో పాత లైసెన్సుల గడువు ముగియనున్నందున, ప్రస్తుతం నడుస్తున్న దుకాణాలకు సంబంధించిన బకాయిలు పూర్తిగా వసూలు చేయాలని శాఖ ఆదేశించింది. మద్యం అమ్మకాల్లో తగ్గుదల లేకుండా, టార్గెట్ మేరకు విక్రయాలు జరగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సిబ్బందికి సూచనలు వెళ్లాయి.

 

 

 

అక్రమాలను కట్టడి – బార్ల రిన్యువల్స్‌పై దృష్టి

 

కొత్త లైసెన్సులు రాని పాత యజమానులు లాభం కోసం అక్రమాలకు ప్రయత్నించే అవకాశాలపై కూడా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది.

బార్లకు సంబంధించిన బకాయిలు వసూలు చేయడం, అన్ని బార్లు సమయానికి రిన్యువల్ అయ్యేలా చూడడం, అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ బృందాలు ఎక్సైజ్ నేరాల నిరోధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

వైఎస్‌ జగన్ చేతుల మీదుగా మోక్షితా రెడ్డికి నామకరణం

YSR Praja News : మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనాదేవి దంపతులు తమ చిన్నారి కుమార్తెకు నామకరణం చేయించాలని ఆశిస్తూ బుధవారం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ను కలిశారు. అభిమానంతో వచ్చిన ఈ దంపతుల కోరికను జగన్ సానుకూలంగా స్వీకరించారు.

 

చిన్నారి వివరాలు తెలుసుకున్న అనంతరం ఆమెకు ‘మోక్షితా రెడ్డి’ అనే పేరు పెట్టి ఆశీర్వదించారు. తమ అమ్మాయి నామకరణం స్వయంగా జగన్ చేతుల మీదుగా జరగడంతో బోళ్ళ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు

ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు!

YSR Praja News : ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసును పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన వివరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఎర్రకోట ఘటన తరహాలోనే భారతదేశంలో మరో పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడి చేయాలన్న ప్రణాళికలు జైష్ ఉగ్ర సంస్థ సిద్ధం చేసిందని ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో వెల్లడించింది.

 

దాడికి కావలసిన నిధుల కోసం అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ ఉపయోగించినట్లు, వాటిలో పాకిస్థాన్‌కు చెందిన “సదాపే” అనే డిజిటల్ యాప్‌ ద్వారా కూడా విరాళాలు చేరినట్టు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఒక్కో విరాళం పాకిస్థాన్ కరెన్సీలో సుమారు 20,000 రూపాయల వరకు ఉండగా, ఇవి భారత రూపాయల్లో దాదాపు ₹6,400గా ఉంటాయని సమాచారం. ఈ నిధులు ఉగ్రవాదుల కార్యకలాపాలు, లాజిస్టిక్ ఖర్చులు, కమ్యూనికేషన్ అవసరాల కోసం వినియోగించినట్లు తెలుస్తోంది.

 

ఇక చలికాలం కోసం ఉగ్రవాదులకు పంపే కిట్‌ను అందించే వారిని కూడా జిహాది మద్దతుదారులుగానే భావిస్తున్నట్లు దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటపడ్డాయి. జిహాదీల మరణం తర్వాత వారి కుటుంబాలకు సహాయం అందించే వారిని కూడ సపోర్టర్లుగా గుర్తిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.

 

ఎర్రకోట పేలుళ్లలో ఉపయోగించిన పేలుడు పదార్థాలు, నిధుల ప్రవాహం, డిజిటల్ లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. ఇటీవల ఫరీదాబాద్‌లో అక్రమ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్ ఈ దాడులకు ఆర్థిక సహకారం అందించిన అనుమానాలు ఎన్ఐఏ వ్యక్తం చేస్తోంది. ఆమెకు ‘మేడమ్ సర్జన్’ అనే కోడ్ నేమ్ ఉండగా, జమాత్-ఉల్-ముమినాత్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

 

ఎన్ఐఏ బృందాలు మొత్తం ఫండింగ్ నెట్‌వర్క్, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, గ్రూప్ అసోసియేషన్‌పై లోతైన విచారణను కొనసాగిస్తున్నాయి.