వైఎస్సార్ సేవా సంఘం నూతన సంవత్సర శుభాకాంక్షలు | ఎస్. సతీష్ రెడ్డి

వైఎస్సార్ సేవా సంఘం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంఘ సభ్యులు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సతీష్ రెడ్డి గారిని కలిశారు.

YSR Praja News Telugu : వైఎస్సార్ సేవా సంఘం సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సతీష్ రెడ్డి గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలను ఘనంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్ర రెడ్డితో పాటు గంగిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, ప్ర గారు, గోపాల్ గారు, రాంభూపాల్ రెడ్డి, మురళీ నాయక్ గారు, సీవీ సుబ్బారెడ్డి గారు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, 2026 సంవత్సరం ప్రజలకు ఆశాజనకంగా ఉండాలని, సంక్షేమం, అభివృద్ధి మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి సేవా సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *