
YSR Praja News : తాడేపల్లి: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని, అభిలాషను గుర్తిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వైకల్యం ఏదైనా ఉన్నా మనసులో ధైర్యం, లక్ష్యసాధనకు ఉన్న పట్టుదల ముందు అవి అడ్డుకాలేవని తెలిపారు. సమాజంలోని ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకుంటూ శిఖరాలను అధిరోహిస్తున్న దివ్యాంగ సోదర సోదరీమణులకు అభినందనలు తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు అని జగన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
https://x.com/ysjagan/status/1996135359235944751?t=lZS7AkfNwCcvv4QreDNkcw&s=19




