YSR Praja News : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్‌గా కిన్నెర వెంకటకృష్ణవేణి విజయం
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని రామానుజవరం గ్రామపంచాయతీలో బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కిన్నెర వెంకటకృష్ణవేణి ఘన విజయం సాధించారు. కఠిన పోటీ మధ్య ప్రజల మద్దతుతో ఆమె గెలుపొందడంతో గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభిమానులు ఆమెకు బలమైన మద్దతు అందించినట్లు స్థానికులు తెలిపారు. ఫలితాలు వెల్లడైన వెంటనే గ్రామంలో సంబురాలు అంబరాన్ని అంటాయి.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ చిత్రపటంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ, తమ విజయానికి సహకరించిన ప్రజలకు కిన్నెర వెంకటకృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత పాలన అనుభవం, బలమైన క్యాడర్, ప్రజాభిప్రాయం వంటి అంశాలు పార్టీ భవితవ్యాన్ని…