
YSR Praja News Telugu : అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన తన సందేశంలో మాట్లాడుతూ.. “శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు సాధించాలి. సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలి. రైతులకు మేలు కలగాలి” అని పేర్కొన్నారు.
అలాగే అన్ని వృత్తుల వారు సంతోషంగా జీవించాలని, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెలు మరియు పట్టణాల్లో ప్రతి ఇల్లు ఆనందంతో కళకళలాడాలని తెలిపారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మరింతగా వర్ధిల్లాలని, ఉగాది పండుగ అందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని వైఎస్ జగన్ తన సందేశంలో అభిలషించారు.




