
YSR Praja News Telugu : ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు (CITU) కార్మిక సంఘం పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని, ఇవి కార్మికుల హక్కులపై ప్రత్యక్ష దాడిగా మారాయని సిఐటియు నేతలు ఆరోపించారు. కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితేనే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పగలమని నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రతన్ సింగ్ చేతుల మీదుగా కార్మికులకు ఐడీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే విధంగా నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చిందని కే. శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కోడ్స్ ద్వారా యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చారని, పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగా నిబంధనలు రూపొందించారని విమర్శించారు. ఫలితంగా కార్మిక వర్గం హక్కులు మరింతగా దెబ్బతింటాయని ఆయన అన్నారు. లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్లలాంటివని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే 29 కార్మిక చట్టాలు అమలులో ఉన్నప్పటికీ వాటిని కచ్చితంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కే. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉన్న చట్టాలకే సరైన అమలు లేకుండా కార్మికులు యాజమాన్యాల చేతుల్లో తీవ్ర శ్రమదోపిడికి గురయ్యారని అన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌తో యాజమాన్యాలకు మరింత వెసులుబాటు లభించిందని, కార్మికులపై శ్రమదోపిడిని చట్టబద్ధం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే కార్మికుల ఉద్యోగ భద్రత, పని గంటలు, జీతాలు, సంఘాల హక్కులు వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సిఐటియు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు వంటి అసంఘటిత రంగ




