
YSR Praja News : మహాదేవపురం: ఈ నెల 21న వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు – ఏర్పాట్లు పూర్తి దశలో
వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన మహాదేవపురంలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు సంఘం ప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారిని వైఎస్సార్ సేవా సంఘం ప్రతినిధులు వారి స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా, సంక్షేమ పాలనకు ప్రతీకగా నిలిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ప్రజలతో కలిసి జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్య అతిథులు, పార్టీ నాయకులు, కార్యకర్తల హాజరుతో ఈ వేడుకలు మరింత ఘనంగా, ఉత్సాహంగా సాగనున్నాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
YSR సేవా సంగం
#YSRSEVASANGAM




