YSR Praja News: ఆర్టీఐ కోసం 15 వేల లంచం.. డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. తెరట్పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన తండ్రి పేరున్న భూమి అక్రమంగా ఇతరుల పేర్లకు రిజిస్ట్రేషన్ అయిందని అనుమానంతో, సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు కోరుతూ దరఖాస్తు చేశాడు. అయితే ఈ సమాచారం ఇవ్వాలంటే “పేపర్ ఖర్చులు” పేరుతో లంచం తప్పదంటూ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రూ.15 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రైతు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టారు. బాలాపూర్‌లోని తన నివాసంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చంద్రశేఖర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి బయటపడాల్సిన చోటే… సమాచారం ఇవ్వడానికి లంచం కోరడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
YSR Praja News : వైఎస్సార్ జిల్లా, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు రాకతో పట్టణం కిక్కిరిసిపోయింది. భాకరాపురంలోని తన…
YSR Praja News Telugu : శింగనమల మండల పరిధిలోని పలు గ్రామాలలో రోజురోజుకూ తీవ్రమవుతున్న త్రాగునీటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)…
కేశంపేట్ మండల కేంద్రంలోని కేశంపేట్ గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బెజ్జం సంతోష శ్రీశైలం యాదవ్ మరియు ఉపసర్పంచ్ కాట్రావత్ రాజు నాయక్‌లను సేవాలాల్ సేన…