
కేశంపేట్ మండల కేంద్రంలోని కేశంపేట్ గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బెజ్జం సంతోష శ్రీశైలం యాదవ్ మరియు ఉపసర్పంచ్ కాట్రావత్ రాజు నాయక్లను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, శాలువాలతో నూతన ప్రజాప్రతినిధులను గౌరవించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రటరీ సేవ్య నాయక్, జిల్లా యువజన అధ్యక్షులు సచిన్ నాయక్, కేశంపేట్ మండల ఉపాధ్యక్షులు నేనావత్ రవి నాయక్, మేగ్య నాయక్, యువ స్టార్ యూత్ అధ్యక్షులు శివ్ రాజ్ నాయక్తో పాటు పలువురు యువకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
సన్మాన కార్యక్రమంలో పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామ సంక్షేమ కార్యక్రమాలకు సేవాలాల్ సేన తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.




