YSR Praja News : తాడేపల్లి: కోటి సంతకాల ఉద్యమం ఘన విజయం – ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ అండ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఘన విజయం సాధించింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఈ ఉద్యమం ద్వారా స్పష్టమైందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తాను వెనకడుగు వేయబోనని స్పష్టం చేసిన వైఎస్ జగన్, ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి 4 లక్షల 11,136 సంతకాల ప్రతులను వైఎస్ జగన్ గవర్నర్‌ను కలిసి అధికారికంగా అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా ప్రజల ఆకాంక్షలను గవర్నర్‌కు వివరించారు.
వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్న సందర్భంగా రహదారులు కిటకిటలాడాయి. అన్ని వర్గాల ప్రజలు ఆయన పోరాటానికి మద్దతుగా తరలిరావడంతో నగరం జనసంద్రంగా మారింది. ఈ ఉద్యమం విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఈ పోరాటం ఇంతటితో ఆగదని, అవసరమైతే న్యాయపోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్లి మరింత బలమైన ఉద్యమం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను డిసెంబర్ 18న రాజ్ భవన్‌కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె. రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్. వెంకటరామాంజనేయులు (ఏడీసీ) పత్రాలను పరిశీలించారు. అనంతరం గవర్నర్‌తో భేటీ సందర్భంగా వైఎస్ జగన్ ఆ ప్రతులను అందజేశారు.
అంతకుముందు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు.
YSR Praja News Telugu : హైదరాబాద్: బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారిని వైఎస్ఆర్ సేవా సంఘం సభ్యులు, పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు.…
YSR Praja News Telugu : కోవెలకుంట్ల: ఆంధ్రప్రదేశ్ రైతాంగ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా, ముఖ్యంగా రాయలసీమ సాగునీటి హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ మరో కీలక…