నల్లచెరువు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ నేనావత్ రవి నాయక్‌కు ఘన సన్మానం

YSR Praja News : మహేశ్వరం మండలం నల్లచెరువు తండా గ్రామంలో నూతనంగా గెలుపొందిన గ్రామపంచాయతీ సర్పంచ్ నేనావత్ రవి నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కొత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవింద్ నాయక్, బాలు నాయక్, ఆంజనేయులు నాయక్, రాంబాబు నాయక్‌లతో పాటు సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ పాల్గొని, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని అందజేసి, శాలువాలతో సర్పంచ్‌ను సత్కరించారు.

ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, గ్రామ అభివృద్ధి పనులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధిపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *