
YSR Praja News Telugu : తాండూరు అవినీతి నిరోధకశాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఏలాం టి మార్పు లేకుండా పోతోంది. పెద్దేముల్ రెవెన్యూ కార్యాలయంలో పదేళ్ల క్రితం తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. తాజాగా ఆర సైతం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం ఇం దూర్ గ్రామానికి చెందిన కొరిడే విఠల్కు సంబం ధించిన సర్వే నంబర్ 104లో మూడు ఎకరాల భూమిని 2017లో రాజుయాదవ్ కొనుగోలు చేశారు. ఆయన 2019లో హైదరాబాద్కు చెందిన రాజుకర్రెడ్డికి విక్రయించారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ అయినా పట్టా కాలేదు. దీంతో రాజుకర్రెడ్డి ఆన్ లైన్లో పెండింగ్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్
రిజిస్టర్) రిపోర్ట్ కోసం ఆర క్షేత్రస్థాయిలో పం చనామా చేసి తహసీల్దా రకు రిపోర్టు ఇవ్వాల్సి ఉం టుంది. ఇందుకు రైతు రాజుకర్రెడ్డిని 5.25 వేలు ఇవ్వాలని ఆర్ఎ రిచర్డ్ సైమన్ డిమాండ్ చేశారు. మొదట రూ.15 వేలు చెల్లిస్తే రిపోర్ట్ ఇస్తానని, పని పూర్తయిన తర్వాత మరో రూ.10 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్లో రాజుకర్రెడ్డి నుంచి ఆస్ఐ రూ.15 వేలు తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.




