YSR Praja News Telugu : మాచన్‌పల్లి: మాచన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ధుసరి కుంట తండాలో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగరగూడెం రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, తండాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తండా వాసులకు రాకపోకల ఇబ్బందులు కలగకుండా త్వరలోనే నాణ్యతతో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్యాల రమేష్, ప్రవీణ్ గౌడ్, కోళ్ల యాదయ్య, మోహన్ రెడ్డి, వార్డు మెంబర్ ఆంజనేయులు, రమేష్, అనిత, బాల్ రాజ్, మహిరెడ్డి, గూడెం సత్తయ్య, బోడ వెంకటయ్య, నరేష్, హరికృష్ణ, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.




