YSR Praja News Telugu : సామాజిక మార్పుకు, బహుజన చైతన్యానికి కాన్షీరామ్ స్ఫూర్తిప్రదాత: భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు రావణ్
జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా):
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాన్యవర్ కాన్షీరామ్ గారి 20వ వర్ధంతి సందర్భంగా భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భీమ్ ఆర్మీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అలీమ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సిద్దు రావణ్ హాజరై మాట్లాడారు. కాన్షీరామ్ గారు బహుజనుల చైతన్యానికి బాటలు వేసిన మహనీయుడని, సామాజిక మార్పుకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు.
రాజకీయ అధికారంతోనే ఆత్మగౌరవం:
కార్యక్రమంలో సిద్దు రావణ్ మాట్లాడుతూ — “రాజకీయ అధికారం లేని సమాజానికి ఆత్మగౌరవం, సమానత్వం సాధించడం కష్టసాధ్యమని గ్రహించి, బహుజనులలో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన దర్శనీకుడు కాన్షీరామ్. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, అణగారిన వర్గాల హక్కుల కోసం, కుల వివక్షతకు వ్యతిరేకంగా, సమాన అవకాశాల సాధన కోసం ఆయన నిరంతరం కృషి చేశారు” అని తెలిపారు. కాన్షీరామ్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నాటిన బహుజన చైతన్య బీజాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.
భీమ్ ఆర్మీ ముఖ్య కర్తవ్యం:
కాన్షీరామ్ గారు ఆశించిన సాధన దిశగా పయనించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బహుజన ఐక్యతను చాటడం, సామాజిక న్యాయాన్ని అందించడం మరియు భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించడమే భీమ్ ఆర్మీ ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నాయకులు, కార్యకర్తలు ధనరాజ్, బాల్రాజ్, విజయ్ కుమార్, అనంతరం, రాకేష్ మామయ్య, నరసింహులు ముదిరాజ్, ప్రేమ్ కుమార్, పండరి, రాచన్న, చంద్రయ్య, బలరాం, గోపాల్, గౌతమ్ కృష్ణ, జైపాల్, రామ్ చందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




