The Science Behind Bathukamma Festival​ బతుకమ్మ పండుగ వెనుక అద్భుతమైన సైన్స్.. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అధ్యయనం వెల్లడి!

  • The Science Behind Bathukamma Festival తెలంగాణ జీవన విధానంలో, సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, దాని వెనుక అద్భుతమైన శాస్త్రీయ దృక్పథం ఉందని ఇటీవల జరిగిన పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వర్షాకాలం ముగిసే సమయానికి చెరువులు, కుంటల్లో నీరు కలుషితం కావడం సాధారణం. ఈ నేపథ్యంలో బతుకమ్మ నిమజ్జనం పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతుందనే దానిపై ‘జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్’ కీలక విషయాలను వెల్లడించింది.

పరిశోధన నేపథ్యం – ‘ట్రెడిషనల్ అండ్ మెడిసినల్ సీక్రెట్స్ ఆఫ్ బతుకమ్మ’

కే. సుధీర్ కుమార్, ఎన్. రవీంద్ర, ఎస్. సీతారామస్వామి తదితర పరిశోధకులు కలిసి ‘ట్రెడిషనల్ అండ్ మెడిసినల్ సీక్రెట్స్ ఆఫ్ బతుకమ్మ: ది ఫ్లోరల్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ’ పేరిట ఒక ప్రత్యేక అధ్యయనాన్ని ప్రచురించారు.

వర్షాకాలం ముగిసిన తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేసే రకరకాల పూల గుత్తులు.. బురద, బ్యాక్టీరియాతో నిండిన నీటిని ఎలా శుద్ధి చేస్తాయో ఈ అధ్యయనం స్పష్టం చేసింది. బతుకమ్మ కేవలం ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాకుండా, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే ఒక అద్భుతమైన పర్యావరణ హిత చర్య అని పరిశోధకులు నిరూపించారు.

పూలలోని ఔషధ గుణాలు – నీటి శుద్ధిలో వాటి పాత్ర

బతుకమ్మ తయారీలో ఉపయోగించే తంగేడు, గునుగు, సీతజడ, రుద్రాక్ష, బంతి, చామంతి వంటి పూలలో విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి నీటిని శుద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి:

తంగేడు పూలు (కాసియా అరిక్యులేట): ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తంగేడు పూలు నీటిలోని కాలుష్యాన్ని తగ్గించి, పీహెచ్ (pH) స్థాయిలను సమతూకం చేస్తాయి. వీటిలో ఉండే టానిన్స్, ఫ్లవనాయిడ్స్ టైఫాయిడ్ కారక బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. అంతేకాకుండా ఇవి రక్తశుద్ధి, మధుమేహ నివారణ వంటి అంతర్గత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటూ, నిమజ్జన సమయంలో సహజ బయోమాస్‌గా పనిచేస్తాయి.

గునుగు పూలు (సెలోసియా): అగ్ని ఎరుపు లేదా వెండి రంగులో ఉండే గునుగు పూలకు తీవ్రమైన వాపులను తగ్గించే గుణం ఉంది. ఆయుర్వేదంలో విరేచనాలు, కడుపునొప్పి నివారణకు వీటిని ఉపయోగిస్తారు.

బంతి మరియు చామంతి: ఇవి సహజ క్రిమిసంహారక, సూక్ష్మజీవ నాశక (Antiseptic) గుణాలను కలిగి ఉంటాయి. చామంతి శరీరంలో వేడిని తగ్గించి చలువ చేయడమే కాకుండా, శరీరంలో వాపులను నియంత్రిస్తుంది.

గుమ్మడి మరియు వాము పూలు: గుమ్మడి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొనడానికి సహాయపడతాయి. వాము పూలతో కలిసి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఈ పూలన్నీ సమష్టిగా చెరువుల్లోని హానికారక సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కాపాడతాయి.

నిపుణుల హెచ్చరిక: ప్లాస్టిక్ పూలు, బురద గుంటలతో అనర్థాలు

ఈ సంప్రదాయం వెనుక ఇంతటి శాస్త్రీయ కోణం ఉన్నప్పటికీ, మారుతున్న కాలంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని ప్రముఖ సీనియర్ సైంటిస్ట్, సీఎస్ఐఆర్-ఎన్ఐఈఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకట మోహన్ హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ పూల వినియోగం: ఇటీవలి కాలంలో కొందరు ప్లాస్టిక్ పూలతో బతుకమ్మలను ఏర్పుతున్నారు. ప్లాస్టిక్ నీటిని తీవ్రంగా కలుషితం చేస్తుంది తప్ప, ఎలాంటి శుద్ధి చర్యను అందించలేదు.

బురద గుంటల్లో నిమజ్జనం: సహజ సిద్ధమైన పూలను కూడా నీరు తక్కువగా ఉండే, కేవలం బురద మాత్రమే ఉన్న గుంటల్లో వేయకూడదు. దీనివల్ల పూలు సరిగ్గా కరిగి మేలు జరగకపోగా, అవి కుళ్లిపోయి నీరు మరింత కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

ముగింపు

k