YSR Praja News Telugu : తాడేపల్లి: కెనడాలోని విన్నిపెగ్లో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన గుంటూరు జిల్లా క్రీడాకారిణి బొల్లు లిఖితకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 76 కేజీల విభాగంలో భారత్ తరఫున పోటీపడి లిఖిత పసిడి పతకం గెలవటంపై ఆయన తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు తేజం విజయం గర్వకారణం:
అంతర్జాతీయ వేదికపై గుంటూరుకు చెందిన యువతి సత్తా చాటి, దేశానికి బంగారు పతకం అందించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని వైఎస్ జగన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు. లిఖిత ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిందని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు, కోచ్లకు ప్రశంసలు:
“లిఖిత ఈ స్థాయి విజయానికి చేరుకోవడంలో అండగా నిలిచిన ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కోచ్ల కృషి ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి, దేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.




