
YSR Praja News : హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై Telangana లో రాజకీయ వేడి కొనసాగుతోంది. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి పవన్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. “తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూడడం ఎవ్వరూ సహించరు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతి తెలంగాణ వ్యక్తి ఖండన వ్యక్తం చేయాలి” అని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పేవరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన సినిమాలు ప్రదర్శనకు అనుమతించబోమని హెచ్చరించారు. “నేను పవన్ అభిమానినే అయినా.. తెలంగాణ గౌరవంపై ఎవరి మాటలూ సహించం. తెలంగాణను రాక్షసులతో పోల్చి మాట్లాడటం అమానుషం” అంటూ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కార్మికులకు 20 శాతం పెంపు విషయంపై ఇచ్చిన సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే స్పందించిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సందర్భంలో అనిరుద్ రెడ్డి గతంలో చేసిన విమర్శలను కూడా గుర్తుచేశారు. “ఏపీలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకున్నారు. చిరంజీవి లేకపోతే పవన్‌కి ఎవరు పట్టించుకునే వాళ్లు లేరు” అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ.. “అంతగా ఏపీ ప్రేమ ఉంటే అక్కడే ఉండి ప్రజలకు సేవ చేయండి, ఇక్కడ ఎందుకు?” అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సాహసం పవన్ కల్యాణ్ చూపాలంటే ఇదే సమయమని ఛాలెంజ్ వి
సిరారు.




