
YSR Praja News ; ఫరూక్‌నగర్ మండలం పుల్చర్ల కుంట తండా గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ విస్లావత్ రాజు నాయక్‌ను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రటరీ సేవ్య నాయక్, జిల్లా యువజన అధ్యక్షులు సచిన్ నాయక్, కేశంపేట్ మండలం ఉపాధ్యక్షులు నేనావత్ రవి నాయక్, మేగ్య నాయక్, యువ స్టార్ యూత్ అధ్యక్షులు శివ్ రాజ్ నాయక్ తదితర నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, శాలువాలతో సర్పంచ్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు ముందుండాలని కోరారు. గ్రామాభివృద్ధి పనులకు సేవాలాల్ సేన తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
సన్మాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.




