అమరావతి: చంద్రబాబు కేసులపై పత్రాల గోప్యత ఎందుకు? – సీనియర్ న్యాయవాది ప్రశ్నలు

YSR Praja News: అమరావతి: చంద్రబాబు కేసులపై పత్రాల గోప్యత ఎందుకు? – సీనియర్ న్యాయవాది ప్రశ్నలు

 

అవినీతి, అక్రమాల ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులను విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసుల‌కు సంబంధించిన డాక్యుమెంట్ కాపీలను బహిర్గతం చేయాలన్న విజ్ఞప్తిపై సీఐడీ అడ్డంకులు సృష్టిస్తోందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

కోర్టు ముందు వాదనలు వినిపించిన ఆయన…

“కోర్టులో ఏ విషయమూ రహస్యమేం కాదు. కోర్టు రికార్డులు ప్రజలకు సంబంధించినవే. అవి ఎవరైనా, చట్టం అనుమతించిన విధంగా పొందే హక్కు ఉంది” అని స్పష్టం చేశారు.

 

ప్రజలకు తెలియజేయడం న్యాయపాలనలో భాగమే

 

డాక్యుమెంట్లు బయటకు వస్తే ఏ సంస్థకు ఇబ్బంది ఉంటుందో? ఏదైనా దాచాల్సిన కారణం ఉందా? అని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.

సీఐడీ ఎందుకు వెనుకంజ వేస్తోందో కోర్టుకు వివరించాలని కోరారు.

 

సుప్రీంకోర్టు ఇప్పటికే ఇటువంటి కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. చార్జ్‌షీట్, ఎఫ్ఐఆర్, ఇతర అన్ని కోర్టు రికార్డులు — మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) కూడా సదుద్దేశంతో తీసుకోవచ్చని చెప్పారు.

 

లోకస్ స్టాండీ వాదన నిరాధారం

 

క్రిమినల్ కేసుల్లో “జోక్యం చేసుకునే హక్కు (Locus Standi)” అనే వాదన ప్రస్తావనే లేదని ఆయన అన్నారు.

“ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితమని ఎవరు అన్నారు? చట్టమే అలాంటి పరిమితిని పెట్టలేదు” అని స్పష్టం చేశారు.

 

చట్టాన్ని పాటించాల్సిందే

 

“డాక్యుమెంట్ ఇవ్వకపోయే పరిస్థితి వస్తే…

సుప్రీంకోర్టులో పోరాటం తప్ప మాకు మరో మార్గం లేదు” అని హెచ్చరించారు.

 

ఈ కేసులో చీరాల‌కు చెందిన సువర్ణ రాజు అనే పౌరుడు ఫిర్యాదు దాఖలు చేయగా, ఆయన తరఫున సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

 

ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఈ విషయంలో గురువారం ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *