తెలంగాణలో ఇమామ్‌ల గౌరవవేతనం సమస్య: ప్రభుత్వం నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున నిరసనలు

YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మైనారిటీల పట్ల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఇమామ్‌లు, మౌజాన్‌లకు ప్రతి నెల చెల్లించాల్సిన గౌరవవేతనాన్ని మూడు నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే విడుదల చేయడం అన్యాయం అని మతపెద్దలు మండిపడుతున్నారు. మైనారిటీల హక్కులను కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

 

గ్రీన్ ఛానల్ వ్యవస్థ ద్వారా సమయానికి చెల్లింపులు చేస్తామని, గౌరవవేతనం ₹12,000/₹10,000కు పెంచుతామని ఇచ్చిన హామీలు అమలులోకి రాకపోవడంతో అసంతృప్తి పెరుగుతోంది. మైనారిటీ సంక్షేమం పేరిట ప్రచారమే తప్ప, ప్రయోజనం లేకుండా పోయిందని నాయకులు విమర్శిస్తున్నారు.

 

03 డిసెంబర్ తేదీన ధర్నా చౌక్–ఇందిరా పార్క్ వద్ద ఆల్ ఇండియా సుఫీ ఉలమా కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాకు రాష్ట్రంలోని అనేక ఇమామ్‌లు, మౌజాన్‌లు హాజరయ్యారు. ఈ ఉద్యమానికి తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

 

ఇమామ్‌ల గౌరవవేతన సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం ప్రకటించాలని, మైనారిటీలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని మార్చాలని ప్రజాస్వరం డిమాండ్ చేస్తోంది.

 

అవసరమైతే, రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైన పోరాటం చేపడతామని నాయకులు హెచ్చ

రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *