దేవుని బండ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం

YSR Praja News : సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఫరూక్‌నగర్ :
ఫరూక్‌నగర్ మండల పరిధిలోని దేవుని బండ గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్ మరియు ఉపసర్పంచ్ శ్యామ్ నాయక్లను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, శాలువాలతో నూతన ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్, జిల్లా యువజన అధ్యక్షులు సచిన్ నాయక్, కేశంపేట్ మండలం ఉపాధ్యక్షులు నేనావత్ రవి నాయక్, మేగ్య నాయక్, గ్రామ అధ్యక్షులు పిర్యా నాయక్, గ్రామ సెక్రెటరీ శ్రీను నాయక్, యువ స్టార్ యూత్ అధ్యక్షులు శివ్ రాజ్ నాయక్తో పాటు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించే దిశగా ముందుండాలని సూచించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు సేవాలాల్ సేన తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
సన్మాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, యువత పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుని బండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *